Uttarakhand: డ్రగ్స్‌కు డబ్బులిచ్చిన వారితో సెక్స్‌కు సై అన్న 17 ఏళ్ల యువతి, కట్ చేస్తే శృంగారంలో పాల్గొన్న వారందరికీ ఎయిడ్స్, ఎంతమందికి సోకిందంటే..
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 17 ఏళ్ళ అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం.. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది.
Nainital, Nov 1: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 17 ఏళ్ళ అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం.. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది.
దీంతో ఆమెతో సెక్స్ లో పాల్గొన్న వారందరూ ఎయిడ్స్ బారినపడ్డారు. ఇది కలవరపెట్టే ధోరణి అని, షాకింగ్ పరిణామమని తాము చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్యాధికారి ఒకరు తెలిపారు. అమ్మాయి అలవాటు ఈ విపత్కర పరిస్థితికి దారితీసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
యువకులు అనారోగ్యం బారినపడడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారికి రామ్‌దత్ జోషి జాయింట్ ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ)లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసైన యువతికి డబ్బులు సాయం చేసిన యువకులు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, వీరు కాకుండా మరెంతోమంది ఆమె దగ్గర ఎయిడ్స్ బారినపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
నైనిటాల్‌లో ఒక్కసారిగా హెచ్ఐవీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడాదికి దాదాపు 20 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని, కానీ, కేవలం 5 నెలల్లోనే 19 కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీశ్ చంద్ర పంత్ తెలిపారు. రామ్‌నగర్‌లో గత 17 నెలల్లో ఏకంగా 45 మంది హెచ్ఐవీ బారినపడినట్టు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 01, 2024 02:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

