PM Modi on Article 370 Verdict: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ, భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యత అంటూ..

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు.

PM Modi on Article 370 Verdict: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ, భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యత అంటూ..
PM Modi (Photo-X)

SC on Article 370 Verdict: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు (Article 370 Verdict)వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు.ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు.  ఆర్టికల్‌ 370 అంశంపై మూడు తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని ఆదేశం

Here's PM Modi Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 11, 2023 02:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).