Vishwak Sen's Movie 'Laila' First Look: లేడీ గెట‌ప్ లో ఇంత క్యూట్ గా ఉన్న మాస్ హీరోను గుర్తుప‌ట్టారా? వాలెంటైన్స్ డే రోజు రిలీజ్ కానున్న మూవీ ఫ‌స్ట్ లుక్ ఇదుగోండి

షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు

Vishwak Sen's Movie 'Laila' First Look: లేడీ గెట‌ప్ లో ఇంత క్యూట్ గా ఉన్న మాస్ హీరోను గుర్తుప‌ట్టారా? వాలెంటైన్స్ డే రోజు రిలీజ్ కానున్న మూవీ ఫ‌స్ట్ లుక్ ఇదుగోండి
Vishwak Sen Laila Movie First Look

Hyderabad, July 03: వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. విశ్వక్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. త్వరలో మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు విశ్వక్. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. ఆల్రెడీ గతంలో లైలా అనే సినిమా చేస్తున్నట్టు విశ్వక్ ప్రకటించాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

 

ఈ సినిమా కోసం. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇందులో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. అయితే క్లోజ్ గా ఫేస్ లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్ గా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

(The above story first appeared on LatestLY on Jul 03, 2024 02:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).