Waqf Bill Approved: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. 14 సవరణలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇవ్వగా. మరో 10 మంది దీన్ని వ్యతిరేకించారు. జేపీసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Waqf Bill Approved: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
waqf amendment (Photo Credits: X/@LokSabhaSectt)

New Delhi, Jan 29: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. 14 సవరణలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇవ్వగా. మరో 10 మంది దీన్ని వ్యతిరేకించారు. జేపీసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

బోర్డులోని పాలకవర్గాల్లో మరింత జవాబుదారీ తనం పెంచుతూ పలు సవరణలు చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దాదాపు 44 సవరణలు జరిగాయి. ఈ విషయాన్ని జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. కొత్త బిల్లు అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రెడీ చేసిన అంచనా విలువల మేరకు వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనసరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Budget sessions) శుక్రవారం (31వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt)30న (గురువారం) ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం (All-party meeting) నిర్వహించనుంది.రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh) నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది.

మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు,   ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

ఈసారి రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తరువాత మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌‌ పార్లమెంటులో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 03:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).