Stampede In Kumbh Mela 2025: మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు,   ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ కన్నుల పండవగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ(Kumbh Mela 2025) జరగనుండగా ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.

Stampede In Kumbh Mela 2025: మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు,   ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
Stampede In Kumbh Mela 2025.. 20KM Traffic jam at prayagraj(X)

Delhi, Jan 29:  జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ కన్నుల పండవగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ(Kumbh Mela 2025) జరగనుండగా ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. ఇక ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు ఉత్తరప్రదేశ్‌ అధికారులు.

మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ జరిగిన తొక్కిసలాటలో(Stampede In Kumbh Mela 2025) వందలాది మంది గాయపడ్డారు. దీనికి కారణం వేలాది మంది భక్తులు స్నానం చేయడానికి ఒకే చోటుకు రావడం. తెల్లవారుజామున 1 గంట నుంచి జనం స్నానానికి వెళ్ళాల్సిన మార్గం సామర్థ్యానికి మించి పెరిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో భక్తులు బారికేడ్లు దకూడం ప్రారంభించగా అక్కడ నిద్రిస్తున్న కుటుంబాలపై పలువురు పడ్డారు. ఆ తర్వాత చెక్క స్తంభం విరిగిపోగా తొక్కిసలాట జరిగింది. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుంభమేళాకు భక్తులు పోటెత్తడం(Kumbh Mela 2025)తో జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తొక్కిసలాట ఘటన తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేశారు అధికారులు.వారణాసి ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిలోని భడోహి సరిహద్దులోని వివిధ ప్రదేశాలలో సుమారు 5 వేల వాహనాలను నిలిపివేశారు అధికారులు.భక్తులు బస చేయడానికి ఐదు హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.  మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మరోవైపు కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(Special Trains for Kumbh Mela) ప్రకటించింది. రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్‌ నుంచి చర్లపల్లికి రానున్నాయి.

మహా కుంభమేళా తొక్కిసలాట ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్ ప్రమాదం చాలా బాధాకరం. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన చాలా బాధాకరం. మరణించిన భక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

 Stampede In Kumbh Mela 2025.. 20KM Traffic jam at Prayagraj

కుంభమేళా తొక్కిసలాటలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయితే మరణాల గురించి యూపీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే న్యూస్ ఏజెన్సీల సమాచారం ప్రకారం 10 మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది.

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని.. గాయపడినవారికి సరైన వైద్యం అందించాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).