Weather Update: దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇప్పటికే నీట మునిగిన పలు రాష్ట్రాలు, వాతావరణ శాఖ హెచ్చరిక ఇదిగో..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
New Delhi, July 7: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్నభారీ వర్షాలకు దక్షిణ కన్నడ జిల్లా ముల్కిలోని బప్పనాడు శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం.. పాక్షికంగా నీట మునిగింది. గర్భగుడి మినహా ఆలయ ప్రాంగణమంతా వర్షపునీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. పెద్దఎత్తున వర్షపు నీరు ఆలయం లోపలికి చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
వీడియో ఇదిగో, ఉత్తరాఖండ్‌లో మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయిన యాత్రికులు, విరుచుకుపడిన భారీ వరదలు
వచ్చే 24 గంటల్లో గోవా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD తెలిపింది. వీటితోపాటు ఒడిషా, గుజరాత్, చత్తీస్ ఘడ్, కేరళలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కర్ణాటకలో భారీ వరదలు, నీట మునిగిన శ్రీదుర్గాపరమేశ్వరి దేవాలయం, వీడియోలు ఇవిగో..
అటు...దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు ఏర్పాడ్డాయి. ఇక ముంబైలో రాత్రి నుంచి వర్షాల తీవ్రత పెరిగింది. దాదర్, మహిమ్, ఖార్, మాతుంగా, కుర్లా వంటి పలు ప్రాంతాల్లో గత 12 గంటల్లో వర్షపాతం 40 మిల్లీ మీటర్ల నుంచి 70 మిల్లీ మీటర్ల వరకు నమెదైంది. రానున్న 24 గంటల్లో గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఢిల్లీలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇది సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువ. ముంబై లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి వర్షం కురుస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళలోని కొట్టాయంలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. మరోవైపు కక్కాడ్ నది పొంగి పొర్లడంతో కన్నూర్ కు వరద పొటెత్తింది. దీంతో అక్కడి నివసించే వారి ఇళ్లు మునిగిపోయాయి. అధికారులు చర్యలు చేపడుతున్నారు.. పల్లపు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు.మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈమేరకు ఇడుక్కి, కాసర్‌గడ్, కన్నూర్ సహా మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
(The above story first appeared on LatestLY on Jul 07, 2023 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

