What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.
What is Disease X: ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్యే ఎక్కువని తెలిపారు. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.
ఈ మిస్టరీ వ్యాధిని వారు ‘డిసీజ్ ఎక్స్’ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్ లో డిసీజ్ ఎక్స్ కేసులు 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. ఈ వ్యాధిపై డబ్ల్యూహెచ్‌వోకి నివేదిక ఇచ్చింది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. ఈ దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా దీనిపై ఎటువంటి ప్రకటనా రాలేదు.
ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తుచేశారు. ఈ కారణంగానే డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోందనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నిపుణులు వివరించారు. ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని డబ్ల్యూహెచ్ వో ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
వ్యాధి లక్షణాలు ఇవే..
జ్వరం, ఒళ్లు నొప్పులు
తలనొప్పి
దగ్గు
జలుబుతో ముక్కు కారడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
రక్తహీనత
డిసీజ్ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది.
కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ప్రపంచ ఆరోగ్య బృందం స్పష్టత ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Dec 10, 2024 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

