Muzaffarnagar, DEC 22: మరో మహిళతో పెళ్లికి సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పగ తీర్చుకున్నది. చివరిసారి కలుద్దామంటూ అతడ్ని పిలిచింది. కత్తితో ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసింది. ఆపై తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Woman Chops Off Boyfriend’s Private Parts) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో (Muzaffarnagar) ఈ సంఘటన జరిగింది. యువ జంట మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది. అయితే మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు యువకుడు సిద్ధమయ్యాడు. ఈ విషయం అతడి ప్రియురాలికి తెలిసింది. దీంతో అతడిపై పగ తీర్చుకోవాలని ఆమె భావించింది.
కాగా, చివరిసారి కలుద్దామంటూ ప్రియుడ్ని ఆ మహిళ పిలిచింది. ఏకాంత ప్రాంతంలో కలిసిన తర్వాత మరో మహిళతో పెళ్లి కుదరడంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వెంట తెచ్చిన కత్తితో ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసింది. ఆ తర్వాత చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
Woman Chops Off Boyfriends Private Parts After Dispute Over Marriage
मुज़फ्फरनगर : प्रेमिका ने प्रेमी का काटा गुप्तांग
➡प्रेमी द्वारा प्यार में धोखा मिलने से काटा गुप्तांग
➡प्रेमिका ने मिलने के बहाने बुलाकर गुप्तांग काटा
➡8 साल से चल रहा था दोनों के बीच अफेयर
➡प्रेमी की शादी दूसरी लड़की से तय होने से थी नाराज
➡पुलिस ने प्रेमी को जिला… pic.twitter.com/OIQydCiPa0
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) December 22, 2024
మరోవైపు ప్రైవేట్ భాగానికి గాయమై రక్తం కారుతున్నప్పటికీ ప్రియురాలి చేతి గాయానికి కట్టుకట్టి ఆమె ప్రాణాలను ఆ వ్యక్తి కాపాడాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిద్దరిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మహిళకు చికిత్స తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.