Viral Baby: రెండు ముఖాలు, నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన శిశువు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వింత‌శిశువును చూసేంద‌కు ప్ర‌జ‌ల క్యూ, మీరూ చూసేయండి (వీడియో)

ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Viral Baby: రెండు ముఖాలు, నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన శిశువు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వింత‌శిశువును చూసేంద‌కు ప్ర‌జ‌ల క్యూ, మీరూ చూసేయండి (వీడియో)
Viral Baby

Lucknow, July 22: ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిరాతాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రమాదేవి నిండు గర్భిణి. ఆదివారం అర్ధరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రేవన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అసాధారణ శిశువుకు రమాదేవి జన్మనిచ్చింది. ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి వైద్యులు, నర్సులు షాక్‌ అయ్యారు. అయితే ఆ శిశువు శరీరం మరో శిశువు శరీరానికి అతుక్కుపోయిందని డాక్టర్లు తెలిపారు. ఒక శరీరం అభివృద్ధి చెందగా మరో శరీరం అభివృద్ధి చెందలేదని చెప్పారు. దీంతో ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు ఉన్నాయని అన్నారు.

 

మరోవైపు వింతగా పుట్టిన శిశువును చూసేందుకు గ్రామస్తులు ఆసుపత్రికి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే పుట్టిన ఐదు గంటల తర్వాత ఆ పసి బాబు మరణించాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా, వింత శిశువు వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(The above story first appeared on LatestLY on Jul 22, 2024 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).