Women Can Offer Namaz in Mosques: మసీదుల్లో ముస్లీం మహిళలు నమాజ్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

మసీదుల్లో నమాజ్ చేయడానికి మహిళల ప్రవేశానికి అనుమతి (Women Can Offer Namaz in Mosques) ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు (AIMPLB to Supreme Court) తెలియజేసింది.

Women Can Offer Namaz in Mosques: మసీదుల్లో ముస్లీం మహిళలు నమాజ్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
Women Can Offer Namaz in Mosques (Photo-IANS)

మసీదుల్లో నమాజ్ చేయడానికి మహిళల ప్రవేశానికి అనుమతి (Women Can Offer Namaz in Mosques) ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు (AIMPLB to Supreme Court) తెలియజేసింది.అయితే, ఒకే లైన్‌లో లేదా ఉమ్మడి ప్రదేశంలో పురుషులు, స్త్రీలు కలిసి ఉచితంగా కలపడం ఇస్లాంలో నిర్దేశించిన స్థానానికి అనుగుణంగా లేదు. వీలైతే మేనేజ్‌మెంట్ కమిటీ ద్వారా ప్రాంగణంలో వేరుచేయడం ద్వారా జాగ్రత్త వహించాలని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. .

ముస్లిం మహిళలు మసీదులో నమాజ్‌ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది. అయితే, మహిళలు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. ఇదే కేసులో ఇంతకు ముందే ఒక అఫిడవిట్‌ను బోర్డు అందజేసింది. ఇది రెండో అఫిడవిట్‌. పర్సనల్‌ లా బోర్డు కేవలం ఇస్లాం సూత్రాలపై సలహాలు ఇచ్చే నిపుణుల సంఘం అని పేర్కొన్నది. తాము ఎలాంటి మత విశ్వాసాలపై వ్యాఖ్యానించదలుచుకోలేదని వెల్లడించింది.

లైకుల కోసం తెగించిన కొత్త జంట, ఏకంగా శోభనం వీడియోను ట్విట్టర్‌ లో పోస్టు చేసిన వధూవరులు, మేము ఎలా గడిపామో చూడండి అంటూ పోస్టు ఛీదరించుకుంటున్న నెటిజన్లు

మసీదులోకి మహిళల ప్రవేశం గురించి పుణేకు చెందిన ముస్లిం మహిళ, న్యాయవాది కూడా అయిన ఫర్హా అన్వర్ హుస్సేన్ షేక్ 2020 లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నుంచి సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. దాంతో బోర్డు రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది.

మహిళలు కావాలనుకుంటే మసీదుకు వెళ్లి నమాజ్ చేసుకోవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తన అఫిడవిట్‌లో పేర్కొన్నది. అయితే, మహిళలు మసీదుల్లో మగవారి మధ్య లేదా మగవారితో కలిసి కూర్చొని నమాజు చేయడం ఇస్లాం అనుమతించదని కోర్టు దృష్టికి తెచ్చింది. మసీదు కమిటీ ఇందు కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లయితే మహిళలు అక్కడికెళ్లి నమాజ్ చేసుకోవచ్చునని తెలపింది.

మసీదుకు వెళ్లి నమాజ్ చేయడం, చేయకుండా ఉండటం అనేది నిర్ణయించుకోవడం వారి చేతుల్లోనే ఉన్నదని చెప్పింది. ముస్లిం మహిళలు జమాత్‌లో 5 సార్లు ప్రార్థన చేయడం లేదా శుక్రవారం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని, స్త్రీలు ఇంట్లో లేదా మసీదులో నమాజ్‌ చేసినా ఆమెకు అదే సవాబ్‌ లభిస్తుందన్నది. అయితే, పురుషులు తప్పనిసరిగా మసీదులోనే నమాజ్‌ చేయాలనే నిబంధన ఉన్నదని కోర్టుకు తెలిపింది.

అఫిడవిట్‌లో పేర్కొన్న ఈ స్థానం కాకుండా, ఎక్కడ కొత్త మసీదులు నిర్మించినా, మహిళలకు తగిన స్థలం కల్పించే అంశాన్ని గుర్తుంచుకోవాలని బోర్డు ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేసింది.ముస్లిం మహిళలు ప్రతిరోజూ ఐదుసార్లు ప్రార్థనలు చేయడంలో ఇస్లాం తప్పనిసరి చేయలేదని, అలాగే ముస్లిం పురుషుల మాదిరిగా కూడా వారానికొకసారి శుక్రవారం నమాజ్ చేయడం మహిళలకు విధిగా లేదని అఫిడవిట్ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Feb 09, 2023 04:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).