UP Polls: యూపీ ఎన్నికల కోసం బీజేపీ ఫస్ట్ లిస్ట్, యోగి, కేశవ్ ప్రసాద్ మౌర్యలు పోటీ చేసేది అక్కడి నుంచే, పుకార్లకు చెక్ పెడుతూ అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Polls) కోసం ప్రధాన పార్టీలు అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party), కాంగ్రెస్ (Congress)లు అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేశాయి. తాజాగా అధికార బీజేపీ కూడా తమ జాబితా ప్రకటించింది.
Lucknow January 15: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Polls) కోసం ప్రధాన పార్టీలు అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party), కాంగ్రెస్ (Congress)లు అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేశాయి. తాజాగా అధికార బీజేపీ కూడా తమ జాబితా ప్రకటించింది. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 95 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది.
బీజేపీ (BJP) ప్రకటించిన తొలి జాబితాలో మొదటి, రెండో దశ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్(Yogi Adityanath), ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) పోటీచేయబోయే నియోజకవర్గాల వివరాలను కూడా తొలి జాబితాలోనే వెల్లడించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ (Gorakhpur ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ జిల్లాలోని సిరాతు (Sirathu) స్థానం నుంచి తలపడనున్నారు. నిజానికి యోగి ఆదిత్యానాథ్ అయోధ్య (Ayodhya) నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో ఆయన పోటీ చేయబోరని కూడా వార్తలు వచ్చాయి. కానీ తొలి లిస్ట్ లోనే సీఎం యోగి పేరుండటంతో వాటికి చెక్ పడింది.
యూపీ(UP)లో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటి దశ పోలింగ్, మార్చి 7న తుదిదశ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.
(The above story first appeared on LatestLY on Jan 15, 2022 04:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

