Zain Nadella Dies: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి, ఉద్యోగులకు మెయిల్ పెట్టిన కంపెనీ యాజమాన్యం
- Read in
- తెలుగు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్(26) కన్నుమూశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. అతని వయస్సు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. జైన్ మరణించినట్లు సాఫ్ట్‌వేర్ తయారీదారు తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్‌లో తెలిపారు. వారి కుటుంబాన్ని తగిన శక్తిని ఇచ్చేలా భగవంతున్ని ప్రార్థించాలని ఈమెయిల్ సందేశంలో కంపెనీ తెలిపింది.
సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీనితో బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. అంటే నడవలేరు. వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్యనాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
కాగా సత్య నాళ్ల 2014లో సీఈవో బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి వైకల్యం కలిగిన ఉత్పత్తికి మెరుగైన సేవలను రూపొందించారు. జైన్ నాదెళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ఇందుకు ఉదాహరించారు. జైన్ నాదెళ్ల ఎక్కువగా చైల్డ్‌రన్స్ హాస్పిటల్ అయిన సీటెల్ చైల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో ఎక్కువగా చికిత్స పొందారు. ఈ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెల్లా ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి నాదెళ్లతో గత ఏడాది చేతులు కలిపింది.
Microsoft CEO Satya Nadella's Son, Zain, Dies At 26 https://t.co/P0OBKtzazi pic.twitter.com/yZsmcsfKs7
— NDTV News feed (@ndtvfeed) March 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2022 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

