ECI: పలు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల కమిషన్, ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి 2 పార్టీలు రద్దు, దేశ వ్యాప్తంగా 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల (253 Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది.

ECI: పలు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల కమిషన్, ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి 2 పార్టీలు రద్దు, దేశ వ్యాప్తంగా 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు
Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, Sep 15: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల (253 Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది. అందులో కేఏ పాల్ (KA Paul) ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) కూడా ఉంది.తెలంగాణ నుంచి రిజిష్టర్ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే యాక్టివ్‌గాలేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

మే 25న ఆర్‌యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌యూపీపీలుగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.ఇప్పటివరకు ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్‌యూపీపీల సంఖ్య 284కు చేరింది.

మూడో ఏడాది కూడా నంబర్ వన్‌గా ఏపీ, ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులు, దేశంలోపెట్టుబడుల ఆకర్షణలో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచిన జగన్ సర్కారు

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ‘పార్టీ రిజిస్టర్‌ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీచేయాలి. ఆ తర్వాత పోటీచేయడం కొనసాగించాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీచేయకపోతే రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగించబడుతుంది’ అని ఈసీఐ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-19 ఎన్నికల్లో పోటీచేయని రాజకీయపార్టీలను సయితం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు. కామన్ సింబల్ కోసం దరకాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు.

కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది.ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటించడంలేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.

ఏపీలో ఈసీఐ జాబితా నుంచి తొలగించిన పార్టీలివీ..

ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్‌దేశం పార్టీ, ఇండియన్స్‌ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం, మన పార్టీ, ప్రజాభారత్‌ పార్టీ.

(The above story first appeared on LatestLY on Sep 14, 2022 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).