Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.

Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..
Brahmanandam (photo-Video Grab)

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.

డీకే శివకుమార్‌‌కు మరోసారి తప్పిన పెను ప్రమాదం, ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు

చిక్ బళ్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బ్రహ్మీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చిక్ బళ్లాపూర్ ప్రాంతంలో తెలుగు వారి ప్రాబల్యం ఉంది. దాంతో బీజేపీ పెద్దలు బ్రహ్మానందాన్ని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

Here's Video

రాష్ట్రంలో డాక్టర్ కె.సుధాకర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చి, దేశం దృష్టి కర్ణాటకపై పడేలా చేశారని బ్రహ్మీ కొనియాడారు. తమలాంటి వాళ్లం ఇవాళ సుధాకర్ గారి కోసం ప్రచారం చేస్తున్నామని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on May 04, 2023 10:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).