KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.

KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??
KCR Speech (photo-Video Grab)

Hyderabad, Nov 1: తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ పేరిట నెటిజన్ లతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం సైతం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఆయన మళ్లీ ఎప్పుడు వస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో

వచ్చే ఏడాది ఎంట్రీ..

వచ్చే ఏడాది గులాబీ దళాధిపతిపతి, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో వస్తారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. 420 హమీలు ఇచ్చిన కాంగ్రెస్ మెడలు వంచుతామని కూడా స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ హామీలపై ఈ ప్రభుత్వానికి కావాలనే కేసీఆర్ ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. 2025లో హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్ 

(The above story first appeared on LatestLY on Nov 01, 2024 08:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).