Modi Cabinet Portfolios Allocated: మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..
ధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. ఇక బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు
New Delhi, June 10: ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. ఇక బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జై శంకర్‌కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. అశ్వనీ వైష్ణవ్‌కు సమాచార శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ కేటాయించారు. ఒక్క ముస్లీం కూడా లేకుండా మోదీ క్యాబినెట్ ఇదిగో, ఏడుగురు మాజీ సీఎంలతో పాటు 7 గురు మహిళలకు అవకాశం, నరేంద్ర మోదీ క్యాబినెట్ పూర్తి లిస్ట్ ఇదే..
తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు. ఇక తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.
Here's List
Portfolio for PM Modi-led Union Cabinet announced
Amit Shah, Rajnath Singh, Nitin Gadkari, Nirmala Sitharaman, Dr S Jaishankar Piyush Goyal and Ashwini Vaishnaw retain their ministries. pic.twitter.com/LkZ0MQiTnk
— ANI (@ANI) June 10, 2024
ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు.
మంత్రుల శాఖలు ఇవిగో..
1. రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ)- రక్షణ శాఖ
2. అమిత్ షా (బీజేపీ)- హోంమంత్రిత్వ శాఖ
3. నితిన్ గడ్కరీ (బీజేపీ)- రోడ్లు, రహదారులు
4. జగత్ ప్రకాశ్ నడ్డా (బీజేపీ)- ఆరోగ్యశాఖ
5. శివరాజ్ సింగ్ చౌహాన్ (కొత్త) (బీజేపీ)- వ్యవసాయం, రైతు సంక్షేమం
6. నిర్మలా సీతారామన్ (బీజేపీ)- ఆర్థికశాఖ
7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (బీజేపీ)- విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (బీజేపీ)- విద్యుత్, గృహనిర్మాణశాఖ
9. హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)- భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (బీజేపీ)- కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
II. ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ) - విద్యాశాఖ
12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం) -
13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ) -
14. సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ)- షిప్పింగ్, పోర్టులు
15. వీరేంద్ర కుమార్ (బీజేపీ)-
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (టీడీపీ) - పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (బీజేపీ) -
18. జుయెల్ ఓరం (కొత్త) (బీజేపీ) -
19. గిరిరాజ్ సింగ్ (బీజేపీ) -
20. అశ్వినీ వైష్ణవ్ (బీజేపీ) - రైల్వే, సమాచారశాఖ
21. జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ) - టెలికాం
22. భూపేంద్ర యాదవ్ (బీజేపీ) -
23. గజేంద్రసింగ్ షెకావత్ (బీజేపీ)- పర్యాటక, సాంస్కృతికశాఖ
24. అన్నపూర్ణాదేవి (కొత్త) (బీజేపీ) -
25. కిరణ్ రిజిజు (బీజేపీ) - పార్లమెంటరీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి (బీజేపీ) - పెట్రోలియంశాఖ
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (బీజేపీ) -
28. గంగాపురం కిషన్ రెడ్డి (బీజేపీ) - బొగ్గు, గనులు
29. చిరాగ్ పాస్వాన్ (కొత్త) (ఎలేపీ-పాస్వాన్) - క్రీడాశాఖ, యువజన వ్యవహారాలు
30. సి.ఆర్.పాటిల్ (కొత్త) (బీజేపీ)- జలశక్తి
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..
31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ)-
32. జితేంద్రసింగ్ (బీజేపీ)-
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (బీజేపీ)-
34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్ (కొత్త) (శివసేన)-
35. జయంత్ చౌధరి (కొత్త) (ఆర్ఎల్డీ)-
సహాయ మంత్రులు
36. జితిన్ ప్రసాద (కొత్త) (బీజేపీ) -
37. శ్రీపాద యశోనాయక్ (బీజేపీ) -
38. పంకజ్ చౌధరి (బీజేపీ) -
39. క్రిషన్ పాల్ (బీజేపీ) -
40. రామ్ దాస్ అఠావలె (ఆర్ పీఐ)-
41. రామ్ నాథ్ ఠాకూర్ (కొత్త) (జేడీయూ) -
42. నిత్యానందరాయ్ (బీజేపీ)-
43. అనుప్రియ పటేల్ (అప్నాదళ్)-
44. వి.సోమన్న (కొత్త) (బీజేపీ)-
45. పెమ్మసాని చంద్రశేఖర్ (కొత్త) (టీడీపీ)- గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
46. ఎస్.పి.సింగ్ బఘేల్ (బీజేపీ)-
47. శోభా కరంద్లాజే (బీజేపీ)-
48. కీర్తివర్ధన్సింగ్ (కొత్త) (బీజేపీ)-
49. బీఎల్ వర్మ (బీజేపీ) -
50. శాంతనూ ఠాకూర్ (బీజేపీ) -
51. సురేష్ గోపి (కొత్త) (బీజేపీ) -
52. ఎల్.మురుగన్ (బీజేపీ) -
53. అజయ్ టంటా (బీజేపీ) -
54. బండి సంజయ్ కుమార్ (కొత్త) (బీజేపీ) - హోంశాఖ
55. కమలేష్ పాశ్వాన్ (కొత్త) (బీజేపీ) -
56. భగీరథ్ చౌదరి (కొత్త) (బీజేపీ) -
57. సతీశ్ చంద్రదూబే (కొత్త) (బీజేపీ) -
58. సంజయ్ సేఠ్ (కొత్త) (బీజేపీ)-
59. రవ్‌నీత్ సింగ్ బిట్టూ (కొత్త) (బీజేపీ) -
60. దుర్గాదాస్ ఉయికె (కొత్త) (బీజేపీ)-
61. రక్షా నిఖిల్ ఖడ్సే (కొత్త) (బీజేపీ)-
62. సుఖాంత మజుందార్ (కొత్త) (బీజేపీ) -
63. సావిత్రి ఠాకుర్ (కొత్త) (బీజేపీ)-
64. టోకన్ సాహు (కొత్త) (బీజేపీ) -
65. రాజభూషణ్ చౌదరి (కొత్త) (బీజేపీ)-
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ (కొత్త) (బీజేపీ) - భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా (కొత్త) (బీజేపీ) -
68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా (కొత్త) (బీజేపీ)-
69. మురళీధర్ మొహోల్ (కొత్త) (బీజేపీ) -
70. జార్జ్ కురియన్ (కొత్త) (బీజేపీ) -
71. పబిత్ర మార్గరీటా (కొత్త) (బీజేపీ) -
(The above story first appeared on LatestLY on Jun 10, 2024 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

