New Karnataka CM: 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా, నా మద్దతు దారుల సంఖ్యను చెప్పను, సీఎం సస్పెన్స్ వేళ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డికె శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నా అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

New Karnataka CM: 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా, నా మద్దతు దారుల సంఖ్యను చెప్పను, సీఎం సస్పెన్స్ వేళ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
DK Shivakumar (Photo Credits: ANI)

Bengaluru, May 15: కర్ణాటక సీఎం ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డికె శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నా అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

డికే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్న సోనియా, సిద్ధరామయ్యకే సై అంటున్న రాహుల్, కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

ఆయన మాట్లాడుతూ..ఇవాళ నా పుట్టినరోజు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడే ఉండిపోయా. తర్వాత ఢిల్లీకి వెళ్తా. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్‌ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నా టార్గెట్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం. నా అధ్యక్షతన 135 స్థానాలు గెలిపించుకున్నా. గెలుపు కోసం నేతలంతా సహకరించారని తెలిపారు. సీఎం ఎవరన్నదానిపై ఇక హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

Here's ANI Tweet 

నాకంటూ ఉన్న మద్దతు దారుల సంఖ్యను చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిని.. ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా. ఢిల్లీ వెళ్లి నా గురువును కలుస్తా. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది. సోనియా, రాహుల్​, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అని శివకుమార్‌ పేర్కొన్నారు. ఒకవైపు సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. అయితే డీకే శివకుమార్‌ మాత్రం బెంగళూరులో ఉండిపోయారు.

(The above story first appeared on LatestLY on May 15, 2023 05:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).