Taminadu Horror: రెండు రోజులుగా నిద్ర పోకుండా కారు న‌డిపిన డ్రైవ‌ర్, రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిప‌డ్డ బాధితురాలు

డ్రైవ్‌ చేసిన వ్యక్తిని కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా సరిగా నిద్రపోని అతడు నిద్ర మత్తులో కారును నడిపినట్లు తెలిపారు. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఫుడ్‌ స్టాల్‌వైపు దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

Taminadu Horror: రెండు రోజులుగా నిద్ర పోకుండా కారు న‌డిపిన డ్రైవ‌ర్, రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిప‌డ్డ బాధితురాలు
Representational Image (File Photo)

New Delhi, FEB 16: అదుపుతప్పిన ఒక కారు ఫుడ్‌ స్టాల్‌లోకి దూసుకెళ్లింది. (Car Rams Into Eatery) ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మహిళ గాల్లోకి ఎగిరిపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తమిళనాడులోని వెల్లూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 11న ఒక వ్యక్తి నిద్రమత్తులో కారు డ్రైవ్‌ చేశాడు. స్పీడ్‌ బ్రైకర్‌ను గమనించకుండా వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కగా ఉన్న ఈటరీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సాయీషా అనే మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి ఆ ఫుడ్‌స్టాల్‌ లోపల పడింది. గాయపడిన ఆమెకు స్థానికులు చికిత్స అందించారు.

 

కాగా, కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తిని కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా సరిగా నిద్రపోని అతడు నిద్ర మత్తులో కారును నడిపినట్లు తెలిపారు. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఫుడ్‌ స్టాల్‌వైపు దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ఈటరీ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(The above story first appeared on LatestLY on Feb 17, 2024 12:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).