Beer is better for you than milk, says PETA(Photo-GETTY)

New Delhi, December 22: ఇప్పటివరకు మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా (People for the Ethical Treatment of Animals) మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. రోజు పెగ్గు బీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న(Beer Is Better For You Than Milk) అనే నినాదాన్ని లేవదీస్తోంది.

సాధారణంగా ఇళ్లల్లో పొద్దున లేవగానే గ్లాసు పాలు తాగాలని వైద్యులు సైతం చెబుతుంటారు.అలాగే పిల్లలకు పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే పెటా(PETA) మాత్రం మనిషి ఆరోగ్యంగా ఉండాంలంటే రోజు పెగ్గు బీర్ బెటర్ అంటోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధనలు చేసి విడుదల చేసిన ఈ రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది.

మనుషుల ఆరోగ్యం కోసం పాలకంటే బీరే చాలా మంచిదని, ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని పెటా ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రేసీ రీమాన్స్‌ స్పష్టం చేశారు. డెయిరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తాయని పెటా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధుల, ఒబెసిటీ, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులు (health issues) వచ్చే ప్రమాదముందని పెటా హెచ్చరించింది. ఇక డెయిరీ ఉత్పత్తుల వాడకం వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని చెప్పిన పెటా.. దీన్ని నిర్థారిస్తూ కొన్ని రుజువులను కూడా వెల్లడించింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయని చెబుతోంది.