Hanuman Jayanti: హనుమంతుని జననం ఎలా జరిగింది, అప్సరకాంత పుంజికస్థలకు బృహస్పతి పెట్టిన శాపమేమిటి, హనుమంతుని జయంతిపై ప్రత్యేక కథనం ఇదిగో..

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది

Hanuman Jayanti: హనుమంతుని జననం ఎలా జరిగింది, అప్సరకాంత పుంజికస్థలకు బృహస్పతి పెట్టిన శాపమేమిటి, హనుమంతుని జయంతిపై ప్రత్యేక కథనం ఇదిగో..
Image Source : QUORA

Hanuman Jayanti History: హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపే అద్భుతమైన కోట్స్, ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేయండి

కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు. సంప్రదాయము ననుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా ఉంది.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేయండి

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది.

దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" కి పంపాక్షేత్ర కిష్కింధా నగరమున జన్మ ఇచ్చింది.

(The above story first appeared on LatestLY on Apr 05, 2023 04:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).