Happy Ugadi 2023: తెలంగాణతో పాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలి, తెలుగు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు చేకూర్చాలన్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

CM KCR (Photo-ANI)

సాగు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ నిత్యవసంతంగా మారిందన్న కేసీఆర్.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. తెలంగాణ సాధించే ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.

Here's CMO TS Tweet

(The above story first appeared on LatestLY on Mar 22, 2023 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).