Horoscope 17 June 2022, Astrology: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Horoscope 17 June 2022, Astrology: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
మేషం
సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
వృషభం
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.
మిధునం
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.
సింహం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కన్య
ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
తుల
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.
వృశ్చికం
సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనస్సు
కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు.
మకరం
ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కుంభం
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
(The above story first appeared on LatestLY on Jun 17, 2022 01:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

