Horoscope Today 6 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి, ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 6న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. సోమవారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

Horoscope Today 6 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి, ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 6న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. సోమవారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

మేషం:

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట వ్యవహారాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

మిధునం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి.

కర్కాటకం

ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

సింహం

కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య

కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

Astrology: ఈ మూడు రాశులకు వినాయకుడి కృపతో అదృష్టం వరిస్తుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

 

వృశ్చికం

చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు

దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మకరం

సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

మీనం

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

(The above story first appeared on LatestLY on Jun 05, 2022 09:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).