astrology

Horoscope Today, July 27, 2026: జ్యోతిష్య శాస్త్రాన్ని, రాశి ఫలాలను విశ్వసించి తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించే వారి కోసం నేటి ద్వాదశ రాశి ఫలాలు వివరంగా అందుబాటులో ఉన్నాయి.

మేష రాశి వారికి ఈ రోజు తోటివారితో అభిప్రాయ భేదాలు లేదా విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మాటతీరులో జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ధననష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన, వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. కుటుంబ విషయాలపై కొంత అనాసక్తి పెరుగుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

వృషభ రాశి వారికి ఆర్థిక నిధుల కోసం చేసే రుణ ప్రయత్నాలు అనుకూలించి ఫలస్తాయి. అయితే కుటుంబంలో ఉన్న పరిస్థితులు అంత సంతృప్తికరంగా ఉండకపోవడం వల్ల మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది. స్త్రీలకు స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. బంధువులు, మిత్రుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది.

మిథున రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన పాత సమస్యలన్నీ సమసిపోతాయి. నూతన గృహ నిర్మాణ లేదా మరమ్మతు కార్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉన్నందున ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందువినోదాల్లో పాల్గొనడంతో పాటు దైవదర్శనాలు చేసుకుంటారు. వీరిలో భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో హారన్ కొడితే భారీ జరిమానా.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

కర్కాటక రాశి వారు తమ పట్టుదలతో తలపెట్టిన కొన్ని ముఖ్యమైన కార్యాలను పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగాల్లో తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండి మనోల్లాసాన్ని కలిగిస్తాయి. అయితే స్వల్ప అనారోగ్య బాధలు కలవరపెట్టవచ్చు.

సింహ రాశి వారు సమాజంలో లేదా ఇతరుల వద్ద గౌరవం పొందేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అయితే కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంత మానసిక ఆందోళన ఉంటుంది. చేపట్టిన ప్రతి పని ఆలస్యంగా పూర్తయ్యే అవకాశముంది. వృత్తిపరంగా అప్రమత్తంగా ఉండకపోతే ఇతరుల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్యా రాశి వారికి తలపెట్టిన కార్యాలకు పలు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మోసపోయే ప్రమాదం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు నూతన పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు.

తులా రాశి వారికి తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల బడలిక పెరుగుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాలకే మానసిక ఆందోళన చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. ఆవేశపడకుండా ఓపిక, సహనంతో వ్యవహరిస్తే పనులు చెడిపోకుండా చూసుకోవచ్చు.

వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. గతంలో వాయిదా పడిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవసాయం ద్వారా మంచి లాభాలు అందుతాయి. ప్రయత్నించిన పనులన్నీ సఫలమవుతాయి. చిన్న విషయాల్లోని సూక్ష్మాలను సులభంగా గ్రహించగలుగుతారు.

ధనూ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన దుస్తులు, ఆభరణాలు ఖరీదు చేసే అవకాశముంది. పాత స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చి సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటారు. ధైర్యసాహసాలతో క్లిష్టమైన పనులను పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

మకర రాశి వారికి కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి విషయంలో సహనం వహించడం వల్ల మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో అనవసర విరోధాలు రాకుండా చూసుకోవాలి. వ్యయం పెరగడం వల్ల రుణ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్య సూచనలు ఉన్నందున సరైన ఔషధ సేవ అవసరమవుతుంది.

కుంభ రాశి వారికి కుటుంబంలో చిన్నపాటి వివాదాలు లేదా గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి చేయి దాటకుండా మీ అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాల సమయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను దాటడానికి రుణాల కోసం ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల నుండి అందాల్సిన సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి.

మీన రాశి వారికి అవసరమైన రుణ ప్రయత్నాలు త్వరగా ఫలించి ఉపశమనం కలిగిస్తాయి. ఉద్యోగ లేదా నివాస స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో శుభకార్యాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. మారుతున్న వాతావరణం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.