Rep. Image (Source: Quora)

గురువారం శ్రీవిష్ణు, లక్ష్మీదేవి ప్రీతికరమైన రోజు. కనుక ఎవరికైతే గురు స్థానం బలహీనంగా ఉంటే వారు గురువారం నాడు లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ధరించి నారాయణునికి బెల్లం,  శనగలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంది.

పసుపు పుష్పాలు, పసుపు బట్టలు , పసుపు, చందనం సమర్పించండి. వీలైతే ఉపవాసం ఉండి సాయంత్రం పూట మిఠాయిలు తిని ఉపవాసాన్ని విరమించండి. ఉపవాసం చేయలేనివారు గురువారం రోజున ఉపవాస కథను చదవాలి లేదా వినాలి. అరటి చెట్టుకు పూజ చేసి నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గురుస్థానం బలపడుతుందని, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు గురుగ్రహానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

Jahangirpuri Violence: అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌పై సుప్రీంకోర్ట్ స్టే, త‌క్ష‌ణ‌మే కూల్చివేత‌ల‌ను ఆపాల‌ని ఆదేశాలు

పూజ చేసే విధానం: 

>>  ప్రతి గురువారం స్నానం చేసే ముందు నీటిలో పసుపును కలుపుకోండి. స్నానం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి.

>>  గురువారం సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసిన తరువాత, విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి. శనగ పిండితో చేసిన ఏదైనా స్వీట్‌ను నైవేద్యంగా పెట్టండి.

>>  గురువారంనాడు పసుపు, పిండి, బంగారం మొదలైనవి దానం చేయండి. అలాగే, ప్రతి గురువారం ఆవుకు పిండిలో బెల్లం , శనగలను కలిపి తినిపించండి.

>>  గురువారం రోజు జుట్టు కత్తిరించవద్దు. గోర్లు కత్తిరించవద్దు.