దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తున్నారు. బుల్డోజ‌ర్లతో రోడ్డుపై ఉన్న షాపుల‌ను ధ్వంం చేస్తున్నారు. ఇవాళ నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌.. జ‌హంగిర్‌పురిలో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేప‌ట్టింది. అయితే అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత కోసం సుమారు 400 మంది పోలీసులు బందోబ‌స్తు చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌పై ఇవాళ సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ త‌క్ష‌ణ‌మే కూల్చివేత‌ల‌ను ఆపాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. సుప్రీం ఆదేశాల‌తో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను ఆపేసిన‌ట్లు నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)