International Women’s Day 2023: హ్యాపీ ఉమెన్స్ డే మెసేజెస్ తెలుగులో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

International Women’s Day 2023: హ్యాపీ ఉమెన్స్ డే మెసేజెస్ తెలుగులో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం
International-Women's-Day-Messages-in-Telugu_1

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది.

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికాలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన వచ్చింది.

యూట్యూబ్ లో వైరల్ అవుతున్న యోగితా సతావ్ యాడ్, 35 కిలో మీటర్లు బస్సు డ్రైవ్ చేసి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన మహిళ..

క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ 17 దేశాల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేయగా దానికి కాన్ఫరెన్స్ కు వచ్చిన అన్ని దేశాల మద్దతు లభించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ లు మీ కోసం..

International-Women's-Day-Messages-in-Telugu_1

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_2

చరిత్ర సృష్టించాలంటే సమాజం దృష్టిలో మంచి నడవడిక ఉండక్కర్లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_3

అమ్మను పూజించు..భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ - హ్యాపీ ఉమెన్స్ డే

International-Women's-Day-Messages-in-Telugu_4

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువైవుంటారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_5

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే

International-Women's-Day-Messages-in-Telugu_6

మహిళ దినోత్సవం శుభ తరుణాన స్త్రీ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_7

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ లోకానికి శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_8
International-Women's-Day-Messages-in-Telugu_9

నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_10

ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_11

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలలందరికి శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_12

స్త్రీ లేకపోతే జననం లేదు.గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

లేటెస్ట్‌లీ తరపున మహిళాలోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

 

(The above story first appeared on LatestLY on Mar 07, 2023 09:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).