Saturday Pooja: శనివారం రావిచెట్టుకు ఈ పూజ చేస్తే, మీ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, అప్పల బాధలు తొలగిపోతాయి, ఏం చేయాలో తెలుసుకోండి

శనివారం.. శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.

Saturday Pooja: శనివారం రావిచెట్టుకు ఈ పూజ చేస్తే, మీ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, అప్పల బాధలు తొలగిపోతాయి, ఏం చేయాలో తెలుసుకోండి
(Photo Credits: File Image)

శనివారం.. శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. శని కోపానికి గురైతే సర్వం కోల్పోతాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శనిదేవుడు దయతో పాటు ఈ నివారణలను ఒక సారి ప్రయత్నించడం ద్వారా జీవితంలో ఎప్పుడు కొరత ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుల బాధ తొలుగుతుంది..

శనివారం రోజు రావి చెట్టుకు నీరు పోయాలి. ఆతర్వాత పాలలో చక్కెర కలిపి చెట్టు మొదలు వద్ద పోయాలి. తర్వాత ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ మీపై ఉంటుంది. ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

​దురదృష్టం తగ్గుతుంది..

శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు...కారం కోసం వంటలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఏలనినాటి శని తొలిగిపోయి దయ కూడా తగ్గుతుంది.

​శని దుష్ప్రభావం తొలుగుతుంది..

శనివారం రోజు బియ్యపు పిండిని చిన్న గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శని దోషం తొలుగుతుంది. అంతేకాకండా శని దుష్ప్రభావం కూడా పోతుంది.

​దానం చేస్తే మంచిది..

శనివారం రోజు నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి క్రూరమైన దృష్ట తొలుగుతుంది. ఇదే సమయంలో పేదలకు, బీదవారికి సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా చెడు విషయాలు తొలిగి ఎవైనా అవంతరాలు ఉన్నా తొలుగుతాయి. ఎందుకంటే శని భగవానుడి పేదలను సూచిస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటారు.

(The above story first appeared on LatestLY on Apr 09, 2022 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).