Sai Baba Pooja on Thursday: గురువారం సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేయవచ్చా, బాబా కృప కోసం గురువారం ఎలా పూజ చేయాలి, అప్పుల బాధ పోవాలంటే సాయి పూజ ఇలా చేయండి..
గురువారం అన్నది సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం అన్నది సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు, పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా, ఆ చిన్న పిల్లలతో కొంత సేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరువవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట.
ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్చమైన నవ్వులు చిందించే పిల్లలు ఈ ప్రపంచానికి స్ఫూర్తి దాయకమని, అటువంటి చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బాబా పేరిట పేరిట అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.
గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదే విధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదే విధంగా గురువారం నాడు పూజ గదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూప దీపాలతో బాబాను పూజించడం మంచిది. బాబాకు జీవ హింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా బాబాకు ఇష్టమైన రోజున పై నియమాలను పాటించడం ద్వారా సాయి బాబా కృప మీపై ఎప్పుడూ ఉంటుంది..
(The above story first appeared on LatestLY on Apr 07, 2022 12:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

