భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహమ్మారికి సంబంధించి మరో పిడుగులాంటి వార్త ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌లో రెండు కొత్త వేరియంట్‌లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ (XE) వేరియంట్‌ కేసు నమోదైనట్లు బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్‌ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కొత్త రకం వేరియంట్‌ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)