దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ పదవిని ఆమ్ ఆద్మీ చేజిక్కించుకుంది. మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఢిల్లీ మేయర్‌గా ఆప్‌ నేత షేల్లీ ఒబెరాయ్‌(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్‌ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో ఆప్‌ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం, ఆప్‌ నేతలు ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు.ఆప్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 స్థానాలకుగానూ ఆప్‌ 134, బీజేపీ 104, కాంగ్రెస్‌ 9 వార్డులను దక్కించుకున్నాయి.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)