Buttermilk Benefits: రోజుకు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగండి, మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు, మజ్జిగ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మజ్జిగకు మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. పాల ఉత్పత్తులతో పోలిస్తే చాలా మందికి మజ్జిగను ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే మజ్జిగలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగడం వల్ల ఒక్క దాహం తీరడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Benefits of Having Buttermilk Post Meals: మజ్జిగకు మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. పాల ఉత్పత్తులతో పోలిస్తే చాలా మందికి మజ్జిగను ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే మజ్జిగలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగడం వల్ల ఒక్క దాహం తీరడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మజ్జిగను కాలాలతో సంబంధం లేకుండా తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ మజ్జిగకు కొత్తిమీర, పుదీనా ఆకులు, జీరా పౌడర్, ఉప్పు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని తాగితే రుచికరంతోపాటుగా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇలాంటి మజ్జిగ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది ; మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలకు మజ్జిగ బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే మజ్జిగను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెరుగ్గా పనిచేస్తుంది. ఈ మజ్జిగలో జీరా పౌడర్ వేసుకుని తాగితే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. మలబద్దకం సమస్య వచ్చే అవకాశమే ఉండదు.
ఎసిడిటీ ; స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి బయటి ఆహారాలను ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్, అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. అయితే ఆ సమయంలో ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తిన్న తర్వాత మజ్జిగను ఖచ్చితంగా తాగటం మంచిది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది ; మజ్జిగలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మజ్జిగలో ఉండే కాల్షియం, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియంలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు చిక్కని మజ్జిగను తాగకూడదు. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చూసుకోవచ్చు.
కడుపు నొప్పి తగ్గిపోతుంది ; పిల్లలకు మజ్జిగను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇది పిల్లల్లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. గడబిడ లేకుండా ఉంటుంది. మజ్జిగ ఎలాంటి కడుపుకు సంబంధించిన సమస్యలైనా ఇట్టే తగ్గిస్తుంది.
రక్తపోటు తగ్గుతుంది ; వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. కానీ ఈ బీపీ గుండె పోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి వారికి మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంది. మజ్జిగ బీపీని త్వరగా కంట్రోల్ చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.
ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల ఉపయోగాలు
ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. మజ్జిగలో మిరియాల పొడి, ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ వేసుకుని అయినా తీసుకోవచ్చు.
మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ డార్క్ చాక్లెట్ తో సహా ఈ 5 పదార్థాలు మీ ఆహారంలో చేర్చండి..
మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొబయాటిక్ అందుతాయి. వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది.
బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి. ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణక్రియలకు మేలు జరుగుతుంది.
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికీ మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తీసుకున్న మజ్జిగ కడుపులోని యాసిడ్స్ ను క్లియర్ చేస్తుంది. అసిడిటీకి మజ్జిగ మంచి ఔషధం. దీనికి మిరియాలు, ధనియాల పొడి, యాడ్ చేసుకోవాలి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే వారికి మజ్జిగతో మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలోని గోడల లైనింగ్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది.
పరగడుపునే ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట. అలాగే, ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే ఇంకా ఎంతో లాభం ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో చక్కెర నిల్వల స్థాయి నియంత్రణలో ఉంటుందట. విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయట. హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుందని గృహ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 03:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

