చాలామంది పెళ్లయిన కొత్తలో శృంగార జీవితం పట్ల చాలా ఆసక్తితో ఉంటారు. అణుక్షణం దాని కోసం పరితపిస్తుంటారు. ప్రతిక్షణం దాన్ని ఆస్వాదిస్తూ తన జీవిత భాగస్వామికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అయితే అది రాను రాను సన్నగిల్లిపోతూ ఉంటుంది. పె
ళ్లయిన కొద్ది రోజులకు సెక్స్ జీవితంపై ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. పని ఒత్తడి వల్ల చాలామందికి దాని మీద అంత మూడు రాదు. ఇక శృంగార జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తిరిగి శృంగారం పట్ల ఆసక్తి రావాలంటే మన లైంగిక జీవితంలో కొన్ని మార్పులు (Tips to Improve Your Sex Life) చేసుకోవడం ఎంతో మంచిది.
మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ డార్క్ చాక్లెట్ తో సహా ఈ 5 పదార్థాలు మీ ఆహారంలో చేర్చండి..
భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటే వారు తమ లైంగిక జీవితం కోసం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి.ఇతర పనులు ఆ షెడ్యూల్ పై ప్రభావాన్ని చూపకుండా ప్లాన్ చేసుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. అలాగే భార్యాభర్తలో ఎవరైనా సెక్స్ పట్ల ఆసక్తి చూపకపోతే మీరు తన వెంటపడి తనని విసిగించకూడదు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ...
ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఇద్దరూ తీవ్ర నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మాటిమాటికి అది కావాలని వెంట అస్సలు పడకూడదు. తనంతట తానే మీతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపేలా మీరు వ్యవహరించాలి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కేవలం లైంగిక జీవితం ఒక్కటే మార్గం కాదని తెలుసుకోవాలి. ఇద్దరు కొన్ని సమయాలలో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం ఒకరినొకరు హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా తిరిగి ఒకరిపై మరొకరికి ప్రేమ కలుగుతుంది.చిన్ని చిన్న మార్పులు మీ జీవితాన్ని ఆనందంగా మార్చుతాయని తెలుసుకోవాలి.