COVID-19 Symptoms: కరోనా మిస్టరీ..లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? కోవిడ్ వైరస్ మోతాదులో తేడానా ? అంతా మిస్టరీయే..
కరోనావైరస్..ఈ ఏడాది ఈ పదం ఒక కల్లోలాన్నే రేపింది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు కకావికలమయ్యాయి. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు రాను రాను కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు (COVID-19 Symptoms) లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. మరికొంత మందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయట. దాదాపు 40 శాతం కరోనావైరస్ రోగులకు (coronavirus infections) కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ పేర్కొంది.

బోస్టన్ లోని ఓ నిరాశ్రయుల ఆశ్రయంలో దాదాపు 147 మందికి కరోనా (Coronavirus) సోకితే.. 88 శాతం మందికి అసలు కరోనా లక్షణాలే లేవని తమ పరిశోధనలో తేలిందని మోనికా గాంధీ పేర్కొన్నారు. దీంతో పాటుగా ఆర్క్‌లోని స్ప్రింగ్‌డేల్‌లోని టైసన్ ఫుడ్స్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మంది కోవిడ్ బారిన పడితే వారిలో 95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని పరీక్షల్లో తేలింది. నార్త్ కరోలినా, ఒహియో మరియు వర్జీనియాలోని జైళ్లలోని 3,277 ఖైదీలు కోవిడ్ బారిన పడగా 96శాతం మందిలో ఒక్క లక్షణం కూడా కనిపించలేదని ఆమె తెలిపింది. కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ బిల్ గేట్స్, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి
కోవిడ్ తీవ్ర లక్షణాలు కనిపించిన వారితో కలిసి ఉన్నవారిలో కొంతమందికి అసలు కరోనావైరస్ సోకలేదు. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లే వీరికి కోవిడ్ సోకలేదా? లేదా కరోనా వైరస్ మోతాదులో తేడా వల్ల వీరు కోవిడ్ బారిన పడలేదా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే ఈ మిస్టరీని చేధిస్తే టీకా లేదా వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని గాంధీ అభిప్రాయపడ్డారు. అలాగే రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు సృష్టించవచ్చని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Aug 10, 2020 07:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).