Health Tips: టమాటోను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు సహ క్యాన్సర్ రమ్మన్నా రాదు..

Health Tips: టమాటాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటారు. ఇది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యంలో కూడా అనేక రకాలుగా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.

Health Tips: టమాటోను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు సహ క్యాన్సర్ రమ్మన్నా రాదు..
(Photo Credits: Pixabay)

Health Tips: టమాటాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటారు. ఇది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యంలో కూడా అనేక రకాలుగా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. టమోటాలో ఉన్న పోషకాలు శరీరాన్ని దృఢంగా మార్చడమే కాకుండా అనేక రకాల జబ్బులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. టమాటలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులతో సహా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల పరిశోధనలో కనుగొనబడింది..

పోషకాలు- టమోటాలో విటమిన్ సి, విటమిన్ ఏ, కె, పోలేట్, పొటాషియం ,మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో లైకోపిన్, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తోటి మన శరీరంలో వచ్చిన అనేక రకాల క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ వంటి వ్యాధులకు రాకుండా ఉంచేందుకు సహాయపడుతుంది..

Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా

క్యాన్సర్-  ప్రతిరోజు టమాటాను తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే లైకోపీననే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పెద్ద పీకు క్యాన్సర్ వంటి వాటిని తగ్గించడంలో లైక్ ఓపెన్ ప్రముఖ పాత్రను పోషిస్తుందని తాజా అధ్యయనాలలో తేలింది..

గుండె ఆరోగ్యానికి- టమాటాలు ఎక్కువ మొత్తంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. సాధారణంగా రక్తపోటు నిర్వహించడం తగ్గించడంలో పొటాషియం చాలా బాగా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా టమాటాలో ఉండే లైకోపిన్ ,యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ధమనులను గట్టిపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. తద్వారా గుండె జబ్బుల రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా మీరు తీసుకునే ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).