Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను తీసుకోకూడదు.

Health Tips: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వులలో క్యాల్షియం, ఐరన్ ,ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను తీసుకోకూడదు.

Health Tips: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వులలో క్యాల్షియం, ఐరన్ ,ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే కొంతమందికి నువ్వులు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను ఆహారంలో భాగం చేసుకోకూడదు. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మలబద్ధకం- మలబద్ధకం సమస్య ఉన్నవారికి నువ్వులు అంతా మంచివి కాదు. ఇది వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. దీనివల్ల పేగులలో అధిక మొత్తంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మలబద్ధక సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నువ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి కడుపులో నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి.

వేడి శరీరం ఉన్నవారు- కొంతమందికి శరీరతత్వం చాలా వేడిగా ఉంటుంది. అటువంటి వారు కూడా నువ్వులను తినకూడదు. నువ్వుల్ని తీసుకోవడం ద్వారా వారి శరీరంలో ఇంకా వేడి పెరుగుతుంది. దీని ద్వారా తల తిరగడం శరీరంలో వాపు మంట వంటివి ఏర్పడతాయి. ఒక్కొక్కసారి వీరికి వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వేడి పరిస్థితుల్లో అధిక వేడి ఉన్నవారు నువ్వులను తీసుకోకూడదు.

Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా

థైరాయిడ్- థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను తీసుకోకూడదు. ఇందులో జింక్, సెలీనియం, ఐరన్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవి థైరాయిడ్ రోగులకు హానికరం నువ్వుల్లో ఉండే అనేక రకాల మూలకాలు థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇది శరీరంలోని అయోడిన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారికి నువ్వులు తీసుకోవడం తగ్గించడం మంచిది.

గర్భిణీలు- గర్భిణీలు కూడా నువ్వులను తీసుకోకూడదు. నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది కడుపులో బిడ్డకు హానికరం నువ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణ వ్యవస్థలో మార్పులు ఏర్పడతాయి. కడుపులో నొప్పి, ఎసిడిటీ, గొంతులో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి గర్భిణీలు నువ్వులకు దూరంగా ఉంటే మంచిది.

గుండె సమస్యలు- నువ్వులలో అనేక రకాల పోషకాలు క్యాలరీలో ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాలను పెంచుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు నువ్వులను పరిమిత ప్రమాణంలో తీసుకోవాలి. గుండె చెప్పులు ఉన్నవారు నువ్వులతో జాగ్రత్తగా ఉండాలి. వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. ఇది గుండెజబ్బు ఉన్నవారికి ప్రమాదకరం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 02:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).