గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఒక్కో గాడిద రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ ఉంటాయట. అవేంటంటే..
> గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.
>> వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.
>> ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.
>> దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.
>> ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
>> ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
>> గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముకలను బలంగా మారుస్తుంది.
>> వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి.
>> గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
>> గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.