Hyderabad Rape: హైదరాబాద్‌లో మరో దారుణం, మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Representative image

Hyderabad :  హైదరాబాద్ లో మరో బాలిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొఘల్ ఫురకు చెందిన ఒక బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి రాత్రంతా అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అయింది. పదమూడేళ్ల బాలికపై క్యాబ్ డ్రైవర్ చేసిన దారుణ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు కిడ్నాప్ అయినట్లు మొఘల్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు బాలికపై అత్యాచారానికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామానికి తీసుకు వెళ్లాడు. అక్కడ మరికొందరు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో లుక్మాన్ కు గ్రామంలో ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ లో బాలికపై లైంగిక దాడి ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకోవడం కలవారిని గురి చేస్తుంది.