Harmful Effects of Skipping Breakfast: ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా, అయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది..

అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం.

Harmful Effects of Skipping Breakfast: ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా, అయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది..
file photo

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ చాలా మంది అల్పాహారం తీసుకోవడం మానేస్తారు. కొంత మంది పని బిజీలో పడి మానేస్తే మరికొందరు తర్వాత తిందాములే అని మానేస్తారు. అయితే ఈ అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం. అల్పాహారం మానేయడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని చాలా మంది నమ్ముతారు. కానీ అది మీకు తీరని నష్టం చేకూరుస్తుంది. అల్పాహారం మానేయడం మంచిది కాదు. ఓట్స్, రాగి మొదలైన అల్పాహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికపాటి అల్పాహారం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

>> ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

>> బ్రేక్ ఫాస్ట్‌ని సరైన సమయంలో తీసుకోవాలి. అల్పాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

>> యువత బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏకాగ్రత బాగా తగ్గిపోతుందట. అదేవిధంగా అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది. బట్టతల కూడా వస్తుంది.

>> బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే చాలా మంది సన్నగా అవ్వాలంటే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు కానీ బ్రేక్ ఫాస్ట్ తినకపోతే లావు అవుతారు.

>> అలాగే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానరు కానీ ఆలస్యంగా తీసుకుంటారు. ఆలస్యంగా టిఫిన్ తిన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 21, 2021 03:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).