SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది.

SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం
supreme court (Photo/ANI)

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది. న్యాయస్థానాలు.. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పును (Madras High Court) సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కింది కోర్టు అతనికి శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

కేసు విచారణ తర్వాత మద్రాసు హైకోర్టు తీర్పు చెబుతూ.. వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరినీ వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు గత జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారించింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుబడుతూ.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరార్హమేనని తీర్పు చెప్పింది.

(The above story first appeared on LatestLY on Sep 23, 2024 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).