Fire Accident in Karnataka: బాణసంచా పేలి 12 మంది దుర్మరణం.. కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌ లో ఘటన.. శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు

కర్ణాటకలో బాణసంచా పేలి 12 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది.

Fire Accident in Karnataka: బాణసంచా పేలి 12 మంది దుర్మరణం.. కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌ లో ఘటన.. శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు
Fire (Representational image) Photo Credits: Flickr)

Newdelhi, Oct 8: కర్ణాటకలో (Karnataka) బాణసంచా (Fire Crackers) పేలి 12 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు (Tamilanadu) సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోడౌన్‌ కు తమిళనాడు శివకాశి నుంచి బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా మొత్తం 12 మంది దుర్మరణం చెందారు. మృతులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

YS Jagan Met Amit Shah: కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు

(The above story first appeared on LatestLY on Oct 08, 2023 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).