Cheetah: ఆ వార్తలు నిజం కావు.. చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు.. నమీబియా నుంచి గత నెల 8 చీతాలు భారత్‌కు రాక.. కునో నేషనల్ పార్క్‌లో వాటిని వదిలిపెట్టిన మోదీ

నమీబియా నుంచి ఇటీవల భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి గర్భం దాల్చినట్టు వచ్చిన వార్తలను కునో నేషనల్ పార్క్ అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా సెప్టెంబరు 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాన నరేంద్రమోదీ విడిచిపెట్టారు.

Cheetah: ఆ వార్తలు నిజం కావు.. చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు.. నమీబియా నుంచి గత నెల 8 చీతాలు భారత్‌కు రాక.. కునో నేషనల్ పార్క్‌లో వాటిని వదిలిపెట్టిన మోదీ
Cheetah (File-Image Source: Twitter)

Bhopal, October 2: నమీబియా (Namibia) నుంచి ఇటీవల భారత్‌కు (India) తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో (Cheetahs) ఒకటి గర్భం (Pregnant) దాల్చినట్టు వచ్చిన వార్తలను కునో నేషనల్ పార్క్ అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’లో (Project Cheetah) భాగంగా సెప్టెంబరు 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌ లో ప్రధాన నరేంద్రమోదీ (Narendra Modi) విడిచిపెట్టారు. నమీబియా నుంచి వచ్చిన ఈ 8 చీతాల్లో ‘ఆశ’ అనే చీతా గర్భం దాల్చినట్టు నిన్న జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.  చీతా గర్భం దాల్చి ఉండొచ్చని అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని చీతా కన్జర్వేషన్ ఫండ్ (సీసీఎఫ్) కు చెందిన డాక్టర్ లారీ మార్కెర్ తెలిపారు. తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలని పేర్కొన్న ఆమె.. నిజంగా అది గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే నమీబియా నుంచి భారత్‌కు మరో బహుమతి అవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇండోనేషియాలో ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన

ఆశా  గర్భం దాల్చడానికే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందన్నారు. ఒకవేళ ఆశా కనుక పిల్లలకు జన్మనిస్తే దానికి మరింత ప్రైవసీ కావాల్సి ఉంటుందని, దానికి మనుషులు కనిపించకుండా చూడాల్సి ఉంటుందని అన్నారు.  అయితే, ఆశ గర్భం దాల్చిందన్న వార్తలను కునో నేషనల్ పార్క్ కొట్టేవేసింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, దానికెలాంటి పరీక్షలు నిర్వహించలేదని, అది గర్భం దాల్చినట్టుగా రిపోర్టులేమీ రాలేదని కునో నేషనల్ పార్క్ అధికారి ప్రకాష్ కుమార్ వర్మ స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Oct 02, 2022 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).