Marriage Cheating: ఆస్తి కోసం ఇంత మోసమా, అమ్మాయిలా నటించి పెళ్ళి చేసుకున్న అబ్బాయి, శోభనం రోజు బండారం బయటపడుతుందని ఏం చేశాడంటే..
ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత భార్యగా వచ్చిన మనిషి నుంచి భారీ షాక్ తగిలింది. అప్పటి వరకూ భార్యలా ఉన్న మనిషి అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. ఆపై పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత భార్యగా వచ్చిన మనిషి నుంచి భారీ షాక్ తగిలింది. అప్పటి వరకూ భార్యలా ఉన్న మనిషి అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. ఆపై పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు.
వైరల్ ఘటన వివరాల్లోకెళితే.. ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఈ నెల 12న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో తనకు నా అనేవాళ్లు లేరని, ఒంటరినని చెప్పిడంతో వరుడి తన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకుని జంటను ఆశీర్వదించారు. పెళ్లిపీటల మీద వరుడు, కడుపు నొప్పి వస్తుందంటూ జంప్ అయిన వధువు, 13 రోజుల పాటు పెళ్లి దుస్తుల్లో అలాగే ఉండి ఆమెనే పెళ్లి చేసుకున్న పెళ్ళి కొడుకు
వివాహం జరిగిన తర్వాత అడిండా బురఖా తీయలేదు. నిత్యం బురఖాలోనే ఉండడం, తన ఇంట్లో వాళ్లతో దూరంగా మెదలడంతో అనుమానం వచ్చినా కొత్త పెళ్లికూతురు సిగ్గుపడుతోందని ఏకే భావించాడు. తనకు పీరియడ్స్ అని చెప్పి అడిండా భర్తను కూడా దూరంపెట్టింది. రోజులు గడిచినా రాత్రిపూట దూరంగా ఉండడంతో అనుమానించిన భర్తకు అసలు విషయం తెలియడంతో షాక్ తిన్నాడు.
2020 నుంచి అడిండా క్రాస్ డ్రెస్సింగ్ (అమ్మాయిలా డ్రెస్సింగ్ చేసుకోవడం) చేస్తున్నాడని ఏకే తెలుసుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. అడిండా చూడ్డానికి అమ్మాయిలా కనిపించడం, గొంతు కూడా అమ్మాయిలాగే ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు చెప్పారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే.. ఏకే ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనేనని అడిండా జవాబిచ్చాడు. కాగా, అడిండా చేసిన మోసానికి ఇండోనేషియా చట్టాల ప్రకారం నాలుగేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 28, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

