Wedding Representational Image

Jaipur, May 29: రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి రోజు ప్రియుడితో వెళ్లిపోయిన వధువును 13 రోజుల తర్వాత వరుడు పెళ్లి చేసుకున్నాడు. ఘటన వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన సకారామ్‌ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్‌ కుమార్‌తో పెళ్లి నిశ్చయమయ్యింది. పెళ్లి రోజు వరుని తరపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు.

వారికి పెళ్లి కుమార్తె తరపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు.ఇక మే 4న ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా..మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే పెళ్లి కూతురు మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది.అనంతరం అక్కడే ఉన్న ఒక తన మామ కొడుకుతో ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు.

జుట్టు పట్టుకొని పిడిగుద్దులతో తలపడిన టీచర్.. ప్రిన్సిపాల్.. విద్యార్థుల ముందే.. వీడియో ఇదిగో.. బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఘటన

ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది.

అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. వారి సంసారం గొడవలు జరగకుండా సాగాలని కోరుకుందాం.