AP CM Chandrababu Shubh Aashirwad Function: అనంత్, రాధికా శుభ్ ముహుర్త్ ఆశీర్వాద్ వేడుకలో సతీ సమేతంగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన భార్య భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు తదితరులు హాజరై అనంత్ – రాధికా దంపతులను ఆశీర్వదించారు.
Mumbai, July 13: ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహం (Anant Radhika Wedding) శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. శుక్రవారం వివాహ మహోత్సవం పూర్తికావడంతో ఇవాళ ‘శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్’ పేరుతో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవం జరిగిన ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’లోనే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు.
#WATCH | Andhra Pradesh CM N Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan with Maharashtra CM Eknath Shinde, Deputy CMs Devendra Fadnavis, Ajit Pawar at Jio World Centre in Mumbai for Anant Ambani and Radhika Merchant's 'Shubh Aashirwad' ceremony. pic.twitter.com/62wJye9Hs5
— ANI (@ANI) July 13, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన భార్య భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు తదితరులు హాజరై అనంత్ – రాధికా దంపతులను ఆశీర్వదించారు.
(The above story first appeared on LatestLY on Jul 13, 2024 10:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

