Flight (Representative image)

Pune, Oct 11: మహారాష్ట్రలో ప్రైవేటు ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానంలో ఓ ప్రయాణికుడు సాటి ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికుడు తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలి ఎదుట హస్త ప్రయోగం చేసుకున్నాడు. అదే సమయంలో ఆమెవైపు కోరికగా చూస్తూ సిగ్గులేని సైగలు చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొంద్వా పట్టణానికి చెందిన ఫిరోజ్‌ షేక్‌ వృత్తిరీత్యా ఇంజినీర్‌. ఇటీవలే అతనికి పెళ్లి నిశ్చయమైంది. నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ సమీపంలోని కొరాడిలోగల వాటర్‌ ప్లాంట్‌లో విధుల నిమిత్తం ప్రైవేట్‌ విమానంలో బయలుదేరాడు. అదే విమానంలో చంద్రాపూర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళా టీచర్‌ పని నిమిత్తం నాగ్‌పూర్‌కు బయలుదేరింది. ఫిరోజ్‌ షేక్‌ సీటు పక్కనే ఆమె సీటు వచ్చింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంది.

విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు, ఉద్యోగం నుంచి తీసేసిన అమెరికన్ సంస్థ

ఆమె పక్కనే విండో వైపు సీట్లో కూర్చున్న ఫిరోజ్‌ షేక్‌ అటుఇటూ కదులుతున్నట్లుగా అనిపించడంతో కళ్లు తెరచి చూసింది. అతని చేతి కదలికలను చూసి దురదవల్ల గోక్కుంటున్నాడేమో అని భావించి మళ్లీ కళ్లు మూసింది. కానీ, అతని కదలికలు మరింత పెరగడంతో మళ్లీ కళ్లు తెరచి చూసింది. అతడు అసభ్యకరమైన పని చేస్తున్నాడని గ్రహించి తన చూపును విమానం లోపలి వైపు తిప్పుకుంది. దాంతో అతను ఆమెను మోచేతితో తడుతూ చూపును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు.

విమానంలో ఇదేం పాడు బుద్ధి, పుల్లుగా తాగి అందరి ముందే ఫ్యాంట్ విప్పి మల మూత్ర విసర్జన, అరెస్ట్ చేసిన పోలీసులు

ఆఖరికి విమానం నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వెనుక డోర్‌ నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో బాధితురాలు అతని వెంటపడుతూ గట్టిగా కేకలు వేసింది. దాంతో విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బాధితురాలి విషయం తెలుసుకుని ఫిరోజ్‌ షేక్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. తాను విమానం సిబ్బందికే ఫిర్యాదు చేద్దామనుకున్నానని, కానీ ఫ్లైట్‌ను మధ్యలోనే దించాల్సి వస్తుందనే కారణంతో ఎయిర్‌పోర్టుకు వచ్చేదాకా ఓపిక పట్టానని బాధితురాలు తెలిపింది.