Man Barks Protest: రేషన్ కార్డులో తప్పుగా నమోదైన పేరు.. దత్తా ఇంటిపేరును కుత్తాగా మార్చిన వైనం.. విసిగిపోయిన యువకుడు కుక్కలా అరుస్తూ నిరసన.. వీడియో ఇదిగో!

రేషన్ కార్డులో తన ఇంటి పేరు దత్తాకు బదులుగా ‘కుత్తా’ అని తప్పుగా నమోదు కావడంతో ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ ఉన్నతాధికారి ఎదుట నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Man Barks Protest: రేషన్ కార్డులో తప్పుగా నమోదైన పేరు.. దత్తా ఇంటిపేరును కుత్తాగా మార్చిన వైనం.. విసిగిపోయిన యువకుడు కుక్కలా అరుస్తూ నిరసన.. వీడియో ఇదిగో!
Credits: Video Grab

Kolkata, Nov 20: రేషన్ కార్డులో (Ration Card) తన ఇంటి పేరు దత్తాకు (Dutta) బదులుగా ‘కుత్తా (Kutta)’ అని తప్పుగా నమోదు కావడంతో ఓ వ్యక్తి కుక్కలా (Dog) మొరుగుతూ ఉన్నతాధికారి ఎదుట నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. పశ్చిమ బెంగాల్‌ (West Bengal) బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ‘గడప వద్దకే ప్రభుత్వం’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హాజరయ్యారు. ఆయన కారు వద్దకు చేరుకున్న శ్రీకాంతి కుమార్ దత్తా కుక్కలా అరుస్తూ కొన్ని పత్రాలు సమర్పించారు. వాటిని తీసుకున్న అధికారి సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆ పత్రాలను సమర్పించారు.

హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్... రయ్యిమని పరుగులు తీసిన ఫ్యూయల్ కార్లు.. రేసింగ్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్, హిమాన్షు.. రేసు జరుగుతున్న సమయంలో స్వల్ప అపశ్రుతి.. ఐమ్యాక్స్ వద్ద కుంగిన గ్యాలరీ.. నేడు కూడా రేసు కనువిందు..

ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీకాంతి కుమార్ దత్తా పేరును రేషన్ కార్డులో శ్రీకాంతి కుమార్ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క కావడంతో కార్డులో తప్పుగా ప్రింట్ అయిన తన పేరును మార్చాలని కుక్కలా అరుస్తూ అధికారికి అర్జీ పత్రాలు సమర్పించాడు. తన పేరు ఇలా తప్పుగా ప్రింట్ కావడం ఇదే తొలిసారి కాదని ఈ సందర్భంగా శ్రీకాంతి కుమార్ పేర్కొన్నాడు. తొలిసారి అతడి పేరును శ్రీకాంత మొండల్ అని రాశారట. దీంతో తప్పును సరిచేయాలని అర్జీ పెట్టుకుంటే దానిని శ్రీశాంతో దత్తాగా మార్చారు. ఆ తర్వాత మరోసారి శ్రీకాంత్ కుమార్ కుత్తా అని మార్చారు. దీంతో విసిగిపోయిన ఆయన ఇక లాభం లేదని ఇలా వినూత్నంగా నిరసన తెలిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

(The above story first appeared on LatestLY on Nov 20, 2022 09:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).