Fake Police Station: బీహార్ లో నకిలీ పోలీస్ స్టేషన్.. ఒకటి కాదు రెండు కాదు.. 8 నెలలుగా వసూళ్ల పర్వం
బీహార్ లో శంకర్ దాదా పోలీస్ స్టేషన్.. అర్థం కాలేదా?
Patna, August 19: శంకర్ దాదా (Shankar Dada) సినిమాలో నకిలీ డాక్టర్ ఉన్నట్టే, బీహార్ లో నకిలీ పోలీస్ స్టేషన్ ఒకటి అందర్నీ బురిడీ కొట్టించింది. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవండి. ఓ దొంగల గ్యాంగ్ ఏకాంగా నకిలీ పోలీస్ స్టేషన్ (Police Station)నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బీహార్ (Bihar) లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. ఎట్టకేలకు అసలు గుట్టు రట్టయింది. అయితే, నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Aug 19, 2022 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

