Andrew symonds: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కు అరుదైన గౌరవం.. టౌన్స్ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూ నిర్ణయం
టౌన్స్ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు టౌన్స్ విల్లే సిటీ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని టౌన్స్ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.
Sydney, August 5: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew symonds) కు అరుదైన గౌరవం లభించింది. సైమండ్స్ జ్ఞాపకార్థం.. ఆయన పుట్టిన టౌన్స్ విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ (Cricket) గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.
కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ ప్రధాన పాత్ర పోషించాడు.
(The above story first appeared on LatestLY on Aug 05, 2022 10:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

