Delhi Horror: ఢిల్లీలో ఘోరం.. రెండో అంతస్తు మీద నుంచి ఏసీ మీద పడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు (వీడియో)
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం అంటారు. ఇదీ అలంటి ఘటనే. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ (ఏసీ) నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Newdelhi, Aug 19: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం అంటారు. ఇదీ అలంటి ఘటనే. ఢిల్లీలోని (Delhi) కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ (ఏసీ) (AC) నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్ట్ 17 శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో జితేష్ చద్దా అనే యువకుడు ఒక ఆగి ఉన్న స్కూటర్ పై కూర్చుని తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. మిత్రులు ఇద్దరు పిచ్చాపాటి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు.
ఢిల్లీలో ఏసీ మీద పడి 18 ఏళ్ల యువకుడు మృతి.. మరో యువకుడికి గాయాలు. pic.twitter.com/wWHKpa1iQR
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
ఊహించని షాక్
ఇంతలో పైనున్న పైనున్న భవనం రెండో అంతస్తు నుంచి ఓ ఏసీ నేరుగా జితేష్ చద్దా తలపై పడింది. దీంతో జితేష్ చద్దా అక్కడికక్కడే మరణించాడు. పక్కనే ఉన్న మరో మిత్రుడు ప్రన్షు కి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
(The above story first appeared on LatestLY on Aug 19, 2024 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

